రహదారి దాటుతున్న ఒక చిరుతపులిని గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చిరుత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని తొనిగండ్ల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
