HomeHEALTHపండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి..

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి..

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, చిన్నారి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసింది.గర్భధారణ చివరి దశలో ప్రసూతి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కలెక్టర్ ఇలా త్రిపాఠికి వైద్యుల పర్యవేక్షణలో విజయవంతంగా ప్రసవం జరిగింది.

ప్రసవానంతరం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి చెందిన అధికారులు, సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కలెక్టర్ కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments