మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని భామ్రాగడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి . ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ పోస్టర్లు విడుదల చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ జులై 30 వరకు గడ్చిరోలి వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు.
అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రవాణా, వ్యాపార సముదాయాలు మూసివేయాలని పోస్టర్లలో పేర్కొన్నారు మావోయిస్టులపోస్టర్ల నేపథ్యం లో భద్రతా బలగాలు మరోసారి అలర్ట్ అయ్యారు
