ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు గండి మాసాని పెట్ గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానించారు. ఆదివారం గ్రామస్తులంతా కలిసికట్టుగా ఏకమై బెల్ట్ షాపులను తొలగింప చేశారు. ఇకనుంచి బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు పేర్కొన్నారు.
మద్యం విక్రయించిన వారిని పట్టుకొని స్వయంగా ఎక్సైజ్ శాఖకు అప్పగించడంతోపాటు జైలుకు పంపుతామని హెచ్చరించారు. దీంతోపాటు 50 వేల రూపాయల చర్మాలను విక్రయించిన వారిపై విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు సమావేశమై ఈ తీర్మానాన్ని చేశారు. ఈ మేరకు గ్రామంలో మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపు యజమానులకు హెచ్చరిస్తూ గ్రామస్తులు నోటీసులు ఇచ్చారు.
అలాగే గ్రామా పంచాయతీ కార్యాలయం తో మద్యం విక్రాయాలను నిషేధంపై నోటీసులు అతికించారు. గండి మాసానిపేట గ్రామంలో మద్యం విక్రాయాల నిషేధంపై స్థానిక ఎస్సై రాజుకు వినతిపత్రం సమర్పించారు.
అలాగే ఎక్సైజ్ కార్యాలయంలో కూడా వినతిపత్రం సమర్పించనున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.
