హైదరాబాద్‌లోని , సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ ల ఆధ్వర్యంలో ఆ స్టేషన్ పరిధిలో వర్షాకాల కాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు మొదలు పెట్టారు .
ఇందులో భాగంగా ఐఎస్ సదన్ (IS Sadan) ఎదురుగా ఉన్న సంతోష్‌నగర్ మెయిన్ రోడ్డులో క్యాచ్ పిట్ల డీసిల్టింగ్ (సిల్ట్ తొలగింపు) పనులను జీహెచ్ఎంసీ (GHMC) మరియు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ సమన్వయంతో నిర్వహించారు.క్యాచ్ పిట్లలో మట్టి, సిల్ట్ మరియు వ్యర్థాలు పేరుకుపోవడంతో వర్షపు నీరు సక్రమంగా డ్రైనేజీలలోకి వెళ్లడం లేదు.
దీనివల్ల స్వల్ప వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోయి, తీవ్ర ట్రాఫిక్ అంతరాయం మరియు వాహనాల రద్దీ సమస్యలు ఏర్పడుతున్నాయి. రానున్న మాన్సూన్ సీజన్లో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా నివారించేందుకు, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చూసేందుకు ఈ డీసిల్టింగ్ పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టడం జరిగింది.
ఈ క్యాచ్ పిట్ల క్లీనింగ్ మరియు డీసిల్టింగ్ కార్యక్రమం సంతోష్‌నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, GHMC మరియు హైడ్రా (HYDRAA) బృందాల తో కల్సి సాగుతోంది.
ప్రజలకు విజ్ఞప్తి: వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు మరియు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పౌరులు డ్రైనేజీలు, క్యాచ్ పిట్లలో వ్యర్థాలను వేయవద్దని, ట్రాఫిక్ పోలీసులకు మరియు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరడమైనది.
