వర్షాకాలం సాగు ప్రారంభమైన సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను విస్మరించి యాప్‌లు, ఆన్‌లైన్ విధానాల పేరుతో కాలయాపన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే లు బిగాల గణేష్ గుప్తా బాజిరెడ్డి గోవర్ధన్ లు మండిపడ్డారు.
శనివారం బిఆర్ యస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
రైతు కష్టాలను అర్థం చేసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
రైతు సంక్షేమాన్ని విస్మరించే ఏ ప్రభుత్వం అయినా ప్రజల మద్దతు కోల్పోతుందని హెచ్చరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఎరువులు, విత్తనాలు, సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
