పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన ఘటనపై సీసీఎస్ పోలీసులు మెరుపుదాడి చేశారు. 5వ టౌన్ పరిధిలోని అజమ్ కాలనీలో సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ సాయినాథ్, ఎస్‌ఐ మహేష్ బృందం ఈ దాడి చేసి 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉన్నాడు. నిందితులపై కేసు నమోదు చేసి 5వ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
