HomeCRIMEపోలీస్ ప్రజావాణిలో 26 ఫిర్యాదులు..

పోలీస్ ప్రజావాణిలో 26 ఫిర్యాదులు..

పోలీస్ ప్రజావాణి ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు.

వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు. వివిధ ఫిర్యాదులకు సంబందించిన 26ఫిర్యాదులను స్వీకరించారు.

ప్రజలు నిర్భయంగా రావాలి*;ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొవలన్నారు.అలాగే పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పోలీస్ కమీషనర్ తెలియజేశారు.

ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments