ముప్పై మంది బ్యాంకు ఖాతాల ను వాడుకొని సుమారు వంద కోట్ల కొట్టేసిన సైబర్ ముఠా డొంక కదలబోతుంది. అమాయకులఆర్థిక బలహీనతలను ఆసరా చేసుకొని ఆన్ లైన్ లోనే అత్యంత సులువుగా కోట్ల రూపాయలు క్షణాల్లో కొట్టేస్తున్నారు.
ఇలాంటి ఓ ముఠా గుట్టు ను రట్టు చేసే పనిలో నగర పోలీసులు కీలక పురోగతి సాధించారు. సైబర్ నేరానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు రాజస్థాన్ కేంద్రంగా సాగుతున్న ఈ దందా డొంక ను కదిలించే లా ఉన్నారు . ఈనెల 8, 9 తేదీల్లో నగరానికి చెందిన బసకొండ నరేశ్ ఖాతాల్లోంచి ఆయన ప్రమేయం లేకుండా రూ.1,04,999 నగదు ను మాయం చేశారు .
దీంతో నరేష్ ఈనెల 11న స్థానిక నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశారు.నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మాయం అయిన నగదు నగరంలోని ఆటోనగర్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్(23) ఖాతాలోకి వెళ్లి నట్లుగాగుర్తించారు .
మహమ్మద్ అబ్దుల్తోపాటు గుడుముల నితీష్(24)లను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజస్థాన్ కు చెందిన ముఠా టెలిగ్రాం యాప్ ద్వార నిరుద్యోగ యువకుల ను అన్ లైన్ లోనే దోస్తీ చేసుకొని నెలసరి ఆదాయం ఆశగా చూపి వారితో ఆయా బ్యాంకు ల్లో అకౌంట్ లు తెరిపిస్తున్నారు. కానీ ఆ ఖాతా ల చెక్ బుక్ లు ఏటియం లు మాత్రం తమ వద్ద పెట్టుకుంటున్నారు.
తమ పేర్లతో ఖాతా తీసినందుకు ప్రతినెలా పది వేల రూపాయలు ఇస్తున్నారు. సైబర్ నేరగాళ్ల అవసరాల కోసం బోధన్ నిజామాబాద్ నగరానికి చెందిన 35 మంది తమ పేర్ల మీద బ్యాంకు ఖాతాలు తీసారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని అమాయకులను ఆన్ లైన్ లోనే నమ్మిస్తున్నారు. వారి ఖాతా ల్లో నుంచి డ్రా చేసుకొని నగదు ను ఇలాంటి ఖాతా లోకి మళ్లిస్తున్నారు. వీరి ఖాతాల్లో నగదు వచ్చిన కొన్ని క్షణాల్లో నే సైబర్ నేరగాళ్లు డ్రా చేసేస్తున్నారు.
తమ అకౌంట్ లు వాడుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రతినెలా పది వేలు ఇస్తున్నారు దీనితో ఈ నేరాల గుట్టు గా సాగుతూ వస్తుంది. కానీ నరేష్ ఇచ్చిన పిర్యాదు తో దర్యాప్తు మొదలు పెట్టిన నాలుగో టౌన్ పోలీసులు నరేష్ అకౌంట్ నుంచి విత్ డ్రా అయిన నగదు ఎవరి ఖాతాల్లో కి వెళ్ళాయో గుర్తించి ఆ ఇద్దరిని అదుపు లోకి తీసుకోని విచారించడంతో రాజస్థాన్ ముఠా సైబర్ దందా వెలుగులోకి వచ్చింది.
ఇలాగే మరో ముప్పై మంది ఈ ముఠా కోసం బ్యాంకు అకౌంట్ లు ఇచ్చారని వెల్లడయింది. అయితే తమ అదుపు లోఉన్న ఇద్దరు ఖాతా లను బ్యాంకు కు వెళ్లి పరిశీలిస్తేపోలీసులకే కళ్ళు బైర్లు కమ్మాయి. ఒకరి ఖాతా లో నాలుగు కోట్లు మరొకరి ఖాతా లో మూడున్నర కోట్లలావాదేవీలు జరిగాయి.
మిగితా 30 మంది ఖాతాల్లోనూ ఇంతకన్నా ఎక్కువగానే లావాదేవీలు జరిగినట్లుగా నిర్దారణ అయింది. సుమారు వంద కోట్లకు పైగానే లావాదేవీలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు.
