Monday, December 8, 2025
HomeCRIMEఅధిక శబ్దం చేసే 350 సైలెన్సర్ల ధ్వంసం..ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి...

అధిక శబ్దం చేసే 350 సైలెన్సర్ల ధ్వంసం..ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహన దారు లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

బుదవారం నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా అదనపు డీసీపీ బాస్వా రెడ్డి ఆధ్వర్యంలో ఎక్కువ శబ్దం చేస్తున్న సైలెన్సర్లను వాహనాల నుంచి తొలగించి, రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో అధిక శబ్దాలు చేస్తున్న సుమారు 350 కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానా విధించడంతో పాటు ప్రజల్లో మార్పు రావడానికి సైలెన్సర్లను తొలగించినట్లు వివరించారు.

సైలెన్సర్ల భారీ శబ్దం కారణంగా ఎంతో మంది హృదయ సంబంధిత రోగాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. శబ్దకాలుష్యం చేస్తున్న బైక్లను ముందుగా సీజ్ చేస్తామని ఫైన్ కట్టాకే రిలీజ్చేస్తామని మళ్లీ అయిన పట్టించుకోకుండా సైలెన్సర్ లు మార్చి అధిక శబ్దానికి పాల్పడితే సౌండ్ పొల్యూషన్ చేస్తే కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతామని సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సిఐ ప్రసాద్, ఎస్సైలు సిబ్బంది తదితరులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!