నగరంలో అక్రమంగా తరలిస్తున్న పి.డి.ఎస్ బియ్యాన్ని రెండవ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు రెండో టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్, సిబ్బంది తో కలిసి తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో, హనుమాన్ టెంపుల్ సమీపంలో ఆటోలో సుమారు నాలుగు క్వింటాళ్ల పి.డి.ఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా వారిని పట్టుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి ఖలీమ్, షేక్ అజార్, గౌటి అజయ్, షేక్ అఫ్రోజ్ అనే నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.
