HomeCRIME40 వ డివిజన్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం..

40 వ డివిజన్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం..

రోడ్డుపై నిల్వ ఉంటున్న మురుగునీరు.. మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యక్తి బైఠాయింపు…డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

మురుగుకాలువల్లో చెత్తాచెదారంతో పేరుకు పోవ డంతో మురుగు నీరు ముందుకెళ్లలేక రోడ్డుపై ప్రవహిస్తోందనీ 40 డివిజన్ కు చెందిన రాగి అనిల్ నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైటాయించాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరంలోని 40 వ డివిజన్ పరిధిలోని గత కొన్ని రోజులుగా కాలువల గుండా మురుగునీరు ప్రవహించే మార్గం సరిగ్గా లేక డ్రైనేజీ కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పడు ఎలాంటి రోగాల బారిన పడాల్సివస్తుందోనని డివిజన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

అందుకు పలు మార్లు 40 వ డివిజన్ కార్పొరేటర్ శివ చరణ్ కు సమస్యలపై చర్చించేందుకు వెళ్లితే చంపేస్తానంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, దుర్భాషాలతో,దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు.

ఈ డ్రైనేజీ వ్యవస్థ పై డివిజన్ సమస్యలపై జవాన్ దృష్టికి తెలిపిన స్పందన లేకుండా దుర్భసలు చేస్తూ,ఎవ్వరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని బేరింపులకు గురి చేస్తున్నాడని ఆయన తెలిపారు.

అధికారులు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని వాపోయారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి 40 వ డివిజన్ కార్పొరేటర్ శివ చరణ్ పై, డివిజన్ జవాన్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments