పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 523.76 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే..నవీపేట్ మండలం అనంతగిరిలోని ఎస్సార్‌ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌మిల్లుపై సివిల్ సప్లై అధికారులు దాడి చేసి 523.76 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బియ్యంతో పాటు తరలింపునకు ఉపయోగిస్తున్న ఈచర్ వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.సివిల్ సప్లై అధికారి పవన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
