తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. బుధవారం హైదరాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
బాధ్యత గల పోలీస్ ఉద్యోగంలో ఉండి మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఫిర్యాదు చేసిన వారిలో పార్టీ నాయకులు నరేందర్ యాదవ్, మనోజా గౌడ్, నరేశ్ ప్రజాపతి, మహేందర్, ఆర్ వీఆర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
