సమాజ సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి కుమారి అద్విక మరోసారి తన మంచితనంతో అందరినీ ఆకట్టుకున్నారు. తన 6వ పుట్టిన రోజు (ఆరో జన్మదినం) సందర్భంగా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి 90 స్వెటర్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కు అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు.
ఈ మేరకు చిన్నారి గత సంవత్సరంలోనూ అరేయ్ ఓ లైవ్ ప్రోగ్రాం లో భాగంగా 60 హెల్మెట్లను కొనుగోలు చేసి పంపిణీ చేశారు. గుండారం శాస్త్రీయనగర్‌లో జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలోనూ, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ ‘2కే రన్’లోనూ విజేతలుగా నిలిచిన వారికి హెల్మెట్లు అందజేసి అభినందనలు అందుకున్నారు.
చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందననీయమని సీపీ కొనియాడారు. ఇలాంటి సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుమారి అద్వికను సీపీ ప్రత్యేకంగా ఆశీర్వదించి, అభినందించారు.
