నిజామాబాద్ రవాణా శాఖలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హోంగార్డులపై అవినీతి ఆరోపణలు రావడంతో వారిని మాతృశాఖకు సరెండర్ చేశారు.
ఆర్టీఏ ఆర్మూర్ యూనిట్లో పనిచేస్తున్న బి. దశరథ్, ఉమ్మడి జిల్లా మొబైల్ స్క్వాడ్‌లో విధులు నిర్వర్తిస్తున్న భాస్కర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల తెలిపారు.
ఇద్దరినీ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సరెండర్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
