HomeTelanganaNizamabadఆస్తిపన్ను బకాయి వడ్డీలపై 90 శాతం రాయితీ..ఎమ్మెల్యే ధన్ పాల్ వ్యాఖ్యలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం..

ఆస్తిపన్ను బకాయి వడ్డీలపై 90 శాతం రాయితీ..ఎమ్మెల్యే ధన్ పాల్ వ్యాఖ్యలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై ‘వన్ టైమ్ సెటిల్మెంట్’కు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆస్తి పన్నుపై వడ్డీలో 90శాతం రాయితీ ఇవ్వాలని పురపాలకశాఖ నిర్ణయించింది.

మార్చి 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలపై 10శాతం వడ్డీ చెల్లించిన వారికి ఓటీఎస్ వర్తిస్తుందని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రజా సమస్యల పై ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలలో నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆస్థి పన్ను బకాయిల పై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఓ టి ఎస్ (వన్ టైం సెటిల్మెంట్) ద్వారా ఆస్తిపన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ కల్పిస్తూ, ఇచ్చిన వెసులుబాటు తెలంగాణలో ఉన్న 13 మునిసిపల్ కార్పొరేషన్లకు కూడా ఇలాంటి వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేసారు.

దీని ద్వారా మున్సిపాల్ కార్పొరేషన్లు ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని సూచించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మునిసిపల్ కార్పొరేషన్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఆస్థి పన్ను బకాయిల పై 90% వడ్డీ మీద రాయితీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 25 తేదీన రాత్రి జీఓ విడుదల చేసింది.

ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ దిలీప్ కుమార్ రాష్ట్ర ఉత్తర్వుల మేరకు 31 తారీకు లోపు కట్టే వారికీ ఆస్థి పన్ను వడ్డీ పై 90% వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటన విడుదల చేసారు.

రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలందరు ఎదురుకుంటున్న సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్య పరిష్కారం అయ్యేల గళం వినిపించిన ఎమ్మెల్యే పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments