ఎస్ఐ వేధింపులు తట్టుకోలేకపోతున్న నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ ఓ వ్యక్తి తన సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
నాలుగు నెలల క్రితం నాగారంకు చెందిన షేక్ రసూల్ భూమిని కబ్జా చేశాడంటూ మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంలో పోలీసులు రసూల్ పై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించారు.
అయితే నెల రోజుల క్రితం రసూల్ కండీషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. బయటకు వచ్చిన నాటి నుంచి నగరంలోని 5వ టౌన్ ఎస్ఐ బెదిరింపులకు గురి చేస్తున్నాడని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
తనని కస్టడీలో ఉన్నపుడు పోలీసులు కొట్టలేదని, ఇప్పుడు ఎస్ఐ అదే మనసులో పెట్టుకొని కొట్టాలని చూస్తున్నాడంటూ, ఎస్ఐ టిఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని వీడియో లో తెలిపాడు.
ఇలా బెదిరింపులు కాకుండా ఒక్కసారే ఎన్ కౌంటర్ చేయాలని,అందుకు రేపు 12 గంటల సమయంలో నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్ చౌరస్తాకు వస్తానని అక్కడే ఎన్ కౌంటర్ చేయాలంటూ రసూల్ వీడియోలో తెలిపారు.
