నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిదీలో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి ఏడు గురి జైలు శిక్ష, పది మందికి జరిమానా విధించనట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే నగరంలో పలు చోట్ల వాహనాల తనిఖీ చేస్తుండగా మద్యం సేవించి పట్టుబడ్డ 17 మందికి ట్రాఫిక్ ఏ.సి.పి టి.నారాయణ ఆద్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ బుదవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.
అనంతరం వారిని జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 10 మందికి 14,000 /- రూపాయలు జరిమానా విధించింది.అలాగే కాశ పోగు కిరణ్, ఓరుగంటి రాకేష్, సతీష్ గౌడ్, పల్లె సత్తయ్య వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష. అలాగే గాదారి నవీన్,ఎండి జావిద్ లకు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
