రిజిస్ట్రార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డాడు. ఈ సంఘటన మెట్ పల్లి లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.మెట్ పల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం లో ఔట్ సోర్సింగ్ లో విధులు నిర్వహిస్తున్న రవి రూ 5000 తీసుకుంటూ ఏసీబీ కి చిక్కడు.
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణు తన భూమి మార్ట్ గేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్ట్రార్ అసీఫొద్దీన్ ను సంప్రదించాడు.భూమి మార్ట్గేజ్ చేసేందుకు 10 వేల రూపాయలు ఇవ్వాలని రవి డిమాండ్ చేయగా చివరకు రూ. 5000 కు బేరం కుదుర్చుకున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవికి 5000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని సబ్ రిజిస్టార్ అసీఫోద్దీన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రవి తో డాక్యుమెంట్ రైటర్ రవి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
