విద్యుత్ ఘాతం తో ఓ ఇళ్లు దగ్ధమైంది. ఈ ఘటన నగరంలోని గాజుల పెట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే నగరంలోని గాజుల పెట్ లోనీ బోయిగల్లీ గల నివాసం ఉంటున్న కుటుంబీకులు బుదవారం అర్థ రాత్రి ఇంట్లో కిటికీ పక్కనే కరెంట్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు రేగాయి.
దీంతో ఇంట్లోని వ్యక్తులు బయటకి వెళ్ళిపోయారు.కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసేసరికి ఇంటిలోని వస్తువులు మొత్తం కాలిపోయాయి.స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేనట్లు తెలిపారు.
