………ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని నందిపేట్ లో వెలిసిన పోస్టర్లు రాజకీయ రగడ కు దారితీసాయి.పక్కా ప్లాన్ ప్రకారమే పోస్టర్ లు తెరమీదికి వచ్చాయి. రెండు పార్టీ లమధ్య రచ్చ మొదలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
పోస్టర్లు అంటించారనే నేపం తో ఇద్దరు బిఆర్ యస్ కార్యకార్తలను అదుపు లోకి తీసుకున్నారు కానీ పోస్టర్ ల వెనుక ఇంకా ఎవరున్నారనేది అరా తీస్తున్నారు. గతంలోనూ ఎమ్మెల్యే లను లక్ష్యంగా చేసుకొని జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఇలాగే పోస్టర్లు వెలిసాయి.
అప్పటి బిఆర్ యస్ సర్కార్ సైతంసీరియస్ గా తీసుకుంది. అయితే నందిపేట్ లో వెలిసిన పోస్టర్ ల వెనుక బిఆర్ యస్ కు చెందిన కీలక నేత ప్రమేయం ఏ మేరకు వుందనేది పోలీసు లు ఆధునిక సాంకేతిక వ్యవస్థ ఆధారాలతో విచారణ చేస్తున్నారు బిఆర్ యస్ అగ్ర నేతే హైదారాబాద్ నుంచి పోస్టర్ల కథ నడిపారనేది బీజేపీ నేతల అనుమానిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోస్టర్ ల వివాదం చిలికి చిలికి రాజకీయ దుమారం కాకుండా కట్టడి చేసే పనిలో పోలీసులున్నారు. గతంలో నందిపేట్ కేంద్రంగానే బిఆర్ యస్ నేతలు ఎంపీ అర్వింద్ మీద దాడికి తెగబడ్డారు. ఆయన మీద హత్య యత్నం చేశారు.
ఈ ప్రాంతంలో ఒకరిద్దరు తీవ్రమైన నేర చరిత్ర ఉన్న ఒకరిద్దరు బిఆర్ యస్ నేతల మీద పోలీసులు డేగ కన్ను కూడా వేశారు గతంలో అనేక అరాచకాలు సాగించిన గులాబీ నేతలు ఇప్పుడు శుద్ధు పూస మాటలను విశ్వసించే పరిస్థితి లేదు.
రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచి ఏడాది అయింది అప్పుడే ఎన్నికల హామీ లమీద ఆయనను టార్గెట్ చేయడం వెనుక పక్కా ప్రణాళిక ఉందనే వాదన కాషాయ శిబిరం లో ఉంది నియోజకవర్గంలోకి రావద్దంటూ గోడపత్రికలు వెలియడంతో..
డొంకేశ్వర్, నందిపేట్ మండలాల బిజెపి శ్రేణులంతా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు వాల్ పోస్టర్లను అతికించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మా ఎమ్మెల్యేని రావద్దంటూ దొంగ చాటున పోస్టర్లు అంటించడం ఫై వారు ఆగ్రహం వ్యక్తం చేసారు , ఇలాంటి వారిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో కూడా ఇస్సపల్లి వద్ద ఎంపీ అరవిందు కాన్వాయ్ పై దాడి చేసి మరణాయుధాలతో హంగామా చేసిన సంఘటనను వారు గుర్తు చేస్తున్నారు బిఆర్ యస్ కు చెందిన ఓ రౌడీ షీటర్ పోస్టర్ లు వేయించాడని వారు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లపై ప్రశ్నించే దమ్ము లేకుండా ఎమ్మెల్యే ను రాజకీయంగా దెబ్బ తీయడానికే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి ఆ పోస్టర్ లతో తమకేమి సంబంధం లేదని బిఆర్ యస్ కార్యకర్తలమీద అక్రమంగా కేసు లు పెట్టారని బిఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
