HomeHEALTHజీజీహెచ్ సూపరింటెండెంట్ బదిలీ కోసం కథ నడిపింది ఎవరో ?

జీజీహెచ్ సూపరింటెండెంట్ బదిలీ కోసం కథ నడిపింది ఎవరో ?

పుట్టిన రోజు వేడుక ను సాకుగా చూపి వేటు ?తెరవెనుక మంత్రాంగం నడిపిన ఇద్దరు డాక్టర్లు ? నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆకస్మిక బదిలీ వ్యవహారం ఆసుపత్రి వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

ఆమె బదిలీ వెనుక పక్క స్కెచ్ వుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్దీ రోజులుగా ఆమె వ్యవహారం నచ్చని ఇద్దరు డాక్టర్లు అధికార పార్టీ నేతల మీద ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఆమె జన్మదిన వేడుకలనే అస్రంగా చేసుకొనిబదిలీ వేటు వేయించారని ప్రచారం జరుగుతుంది.

బిఆర్ యస్ హయాంలోనే జిజిహెచ్ ఆసుపత్రి సూపరెండెంట్ గా ప్రతిమా రాజ్ నియామకం అయ్యారు. అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆమె ఆసుపత్రి పరిస్థితులను చక్కదిద్దుతూ వచ్చారు.

చాల కాలంగా అదే కుర్చీ లో పాతుక పోయారు. కరోనా విపత్తు లో ఆమె చూపిన చొరవ వల్లే ఆ బాధ్యతల్లో కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఆసుపత్రి లో ఇద్దరు డాక్టర్లకు ఆమె పాలన వ్యవహారాలు ఏ మాత్రం నచ్చలేదు.

ఆసుపత్రి లో బాధ్యతలు వదిలేసి ప్రయివేట్ ప్రాక్టీస్ ల్లో బిజీగా ఉండే సదురు డాక్టర్లు ఆమె బదిలీ చేయించడానికి బిఆర్ యస్ హయాంలో నే సర్వ శక్తులుఒడ్డారని ప్రచారం జరిగింది. కానీ గతంలో ఉన్న కలెక్టర్ ఆమె బదిలీ కి ససేమిరా అనడంతో బిఆర్ యస్ పెద్దలు వెనక్కి తగ్గారు.

ప్రభుత్వం మారింది. అధికార పార్టీ కి చెందిన ఓ కీలక ప్రజా ప్రజాప్రతినిధి ముందు పెట్టి ఇద్దరు డాక్టర్లు ఆమె బదిలీ కోసం మరోసారి పావులు కదుపుతున్న క్రమంలోనే కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఘనంగా ఆమె పుట్టినరోజు వేడుకలు సూపరెండెంట్ ఛాంబర్ లో జరుపు కోవడం, సిబ్బంది నుంచి కానుకలు పొందడం తో ఆమెను బదిలీ కి అస్రంగా పనిచేసాయి .ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తి గత వేడుకలు జరిపితే ప్రభుత్వ అధికారులు తఖీదు జారీ చేసి తదుపరి విచారణ కొనసాగించాలి.

కానీ ఆమెను బదిలీ చేసి వారి స్థానంలో ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా పీడియాట్రిక్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు.ఏకంగా బదిలీ చేయడం అదికూడా ఒక్క రోజులోనే ఉత్తర్వ్యూలు రావడం వెనుక బలమైన ఒత్తిళ్లే పనిచేయసాయని చెప్తున్నారు.

జిల్లా ఆసుపత్రి లో నాలుగేళ్లుగా ఇన్చార్జి సూపరింటెండెంట్ గా సమర్థవంతంగా పని చేస్తూ వచ్చారు . పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments