నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మ హత్య చేసుకున్నారు. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని నాగారం లోని వడ్డెర కాలానికి చెందిన మక్కల లక్ష్మణ్(29). అప్పుల బాధ తో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే న్యాల్కల్ గ్రామానికి చెందిన పొట్టెగారి శ్యామ్ రావు(55) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైనట్లు తెలిపారు.
తన చిన్న కుమారుడు అయ్యప్ప స్వామి మల వేసుకోవడంతో మద్యానికి అలవాటు పడి తాగకుండా ఉండకపోవడంతో మానసికముగా కృంగి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
