నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ బేస్ ద్వారా ఉద్యోగుల దరఖాస్తుల ఆహ్వానంకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్-8, అసోసియేట్ ప్రొఫెసర్-2, అసిస్టెంట్ ప్రొఫెసర్-28, ట్యూటర్- 4, జూనియర్ రెసిడెంట్-18 మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్-7 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం స్వీకరణ తేదీ: 17.01.2025 నుండి 20.01.2025 వరకు సమయం ఉదయం 10.30 నిమిషాల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయంలో స్వీకరించబడునట్లు తెలిపారు.
దరఖాస్తు చేసుకున్నా అభ్యర్ధులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు 20 వ తేదీన సమయం 11.00 గంటలకి ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
పోస్టుల సెలక్షన్ కొరకు వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 21 వ తేదీన ఉదయం 11.00 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయం నందు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కొరకు అనగా ఖాళీలు, వేతనం మొదలగు వాటి గురించి ఈ కళాశాల వెబ్సైట్ www.gmcnzb.org లాగిన్ కలవాలని తెలిపారు.
