లింగంపేట మండలం ముస్తాపూర్ తండా వద్ద ముస్తాపూర్ గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు ప్రయాణిస్తున్న బైకును గురువారం రాత్రి వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను మృతి చెందాడని కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది.
