నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు వాడివేడిగా చర్చలు సాగుతోంది.శనివారం మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు.
బిజెపి, ఎంఐఎం పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ పరిధిలో గత కొన్ని రోజులుగా వీధి వ్యాపారులకు ట్రాఫిక్ పోలిసులు,మున్సిపల్ అధికారులు విక్రయాలు చేయనీయడం లేదని నిరసన చేపట్టారు.
దీనికి బిజెపి నాయకులు శంభుని ఆలయ పరిధిలో కూరగాయల వ్యాపారులకు రోడ్డు పక్కన విక్రయించకుడదని ఎన్ని మార్లు తెలిపిన పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.
దీనికి మున్సిపల్ కమిషనర్ స్పందించి దీనిపై కమిటీ వేయాలని కోరారు. దీంతో మేయర్ ముందు ఎంఐఎం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
