ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ 2025 నూతన క్యాలెండర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచల గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని తెలిపారు.
సామాజిక అంశాల పైన, న్యాయపరమైన అంశాల పైన, అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి విద్యార్థులలో ఆ అంశాలపై చైతన్యం తీసుకొచ్చి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి విద్యార్థి సంఘంగా పనిచేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జనం భానుచందర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్, బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసలే నగేష్ ,నగర అధ్యక్షుడు అఖిల్ చారి, సుజిత్, వీరేష్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు
