నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల వరుస దొంగతనాలకు పాల్పడుతూ అంతర్ రాష్ట్ర ముఠా ను పట్టుకున్నామని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి చెప్పారు ఆయన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేసిన దొంగతనాల కేసులను ఛేదించడానికి ప్రత్యేకమైన టీమ్స్ ని ఏర్పాటు చేసి గాలించగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రఘుపతి మరో బృందంగా ఏర్పడి తన
ఈ కేసులను చేదించారని ఆయన చెప్పారు ఈ ముఠా లో ప్రధాన సూత్రధారి మహారాష్ట్ర లోని పర్బనీ కి చెందిన డ్రైవర్ కరణ్ సింగ్ ను అదుపులోనికి తీసుకొని విచారించగా తాను చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. కరణ్ సింగ్ అతని ముఠా పుసలగాల్లీ లోని ఒక బట్టల షాపు వద్దకు వెళ్లి గ్లోవ్స్, మంకీ క్యాప్ లు దరించి ఇనుప రాడ్ తో షట్టర్ పైకి లేపి కట్టర్ తో తాళము ద్వంసం చేసి లేనికేల్లి కాంటర్ లోని రూ వేలు చోరీ చేసారని అదే రోజే రాత్రి రెండు గంటలకు ఒక మెడికల్ వద్దకు షట్టర్ పైకి లేపి కట్టర్ తో తాళము ద్వంసం చేసి కౌంటర్ లోనిరూ26వేల నగదు దొంగిలించారని అదే రోజే రాత్రి 3 గంటలకు చంద్రశేఖర్ నగర్ కాలనీ లో ఒక మెడికల్ షాప్ లోకి చొరబడి రూ వెయ్యి అలాగే తెల్లవారు జామున 4 గంటలకు నిజామాబాదు లోనే సుబాష్ నగర్ లో గల ఒక షాప్ ను ఇనుప రాడ్ తో షట్టర్ పైకి లేపి కట్టర్ తో తాళము ద్వంసం చేసి రూ 4000వేలను, 3 వెండి బిళ్ళలను ఎత్తుకెళ్లారని వెళ్తూ సీసీ కెమెరా లను ఉన్నందున దాని డివిఆర్ ను తీసుకెళ్లారన్నారు
ఈనెల 09.న రాత్రి దుబ్బా లో ఒక ఇంటి ముందు నిల్పి ఉంచిన హోండా షైన్ ను మా వద్ద గల నకిలీ తాళముతో తిసి దొంగిలించిఅదే బైక్ పైన తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ లో గల మెడికల్ షాప్ తాళము ద్వంసం చేసి కాంటర్ లోని రూ 85వేలు నగదుఎత్తుకెళ్లారని ఏసిపి వివరించారు అదే రోజు వారు దొంగిలించిన బైక్ పైన పుసలగాల్లీ లోన గల ఒక బట్టల షాప్ షాప్ వద్దకు కాంటర్ లోని రూ 2,40లక్షలు ఎత్తుకెళ్లారని అక్కడి నుంచి బైక్ పైన డిచ్పల్లి లోని బస్ స్టాండ్ దగ్గరలో గల గోల్డ్ షాప్ లోకి చొరబడ్డారు వెండి తో పాటు రూ 4వేల నగదు ఎత్తుకెళ్లారు.
గత నవంబర్ నెలలో కరణ్ సింగ్ అజయ్ లు బైక్ పైన నిజామాబాదు కు వచ్చి కోర్ట్ కు కొద్దిగా దూరములో రోడ్ పక్కనే గల మెడికల్ షాప్ వద్ద తాళము ద్వంసం చ కాంటర్ లోని రూ 5,లక్షలు నగదు ఎత్తుకెళ్లారని కాష్ ను దొంగిలించుకొని వెళ్లినారు.
కంటేశ్వర్ లోనూ మరో మెడికల్ షాప్ లో రూ 2లక్షల నగదు కాష్ ను దొంగిలించుకొని వెళ్ళినారు.ఆజం రోడ్ లో మెడికల్ షాప్ లోనూ చొరబడ్డారు కానీ అక్కడ ఏమి దొరకలేదు.ఈ ముఠా కు చెందిన మరో ముగ్గురు పరారీ లో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు .
