HomeCRIMEద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్టు.5 వాహనాలు స్వాధీనం..ముగ్గురు నిందితులు అరెస్టు..

ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్టు.5 వాహనాలు స్వాధీనం..ముగ్గురు నిందితులు అరెస్టు..

ఇళ్లు, దుకాణాల వద్ద ఆపి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసే ముఠాను పోలిసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి తెలిపారు.

సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ముగ్గురు నిందితులను నుంచి వద్ద నుంచి 4 హెచ్ఎఫ్ డీలక్స్,1 పల్సర్‌, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందన్నారు.

శాస్త్రినగర్ , గుండారం చెందిన అనిల్ నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ ముందు పార్క్ చేసి గ్రౌండ్ లోకి వాకింగ్ చేయడానికి వెళ్ళి, తిరిగి వచ్చి చూడగా తన మోటార్ సైకల్ లను చోర్ చేశాడు.

దీంతో బాధితుడు వచ్చి చూసేసరికి వాహనం కనిపించలేదని, అంతటా తన మోటార్ సైకల్ గురించి వెతికినా ఎక్కడ ఆచూకీ తెలియనందున మూడవ టౌన్ లో ఫిర్యాధు చేయగా కేసు నమోదు చేశారు.

నేరాలు అదికంగా జరుగుతున్నందున పై అదికారుల పర్యవేక్షణ లో, విశ్వసనేయ సమాచారం మేరకు కంటేశ్వర్ లో వాహనాల తనీకి చేస్తుండగా అనిల్ పోలీసులను చూసి తన మోటార్ సైకిల్ పై పారిపోవడానికి ప్రయత్నించగా టౌన్-3 పోలీసు ఎస్.ఐ మరియు సిబ్బంది అతనిని పట్టుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.

4 మోటార్ సైకల్ ల ని స్వాదినం చేసుకున్నామని తెలిపారు. అలాగే చేసుకొని అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.ద్యావంగుల సంతోష్,ఒల్లెపు గోపి ఇద్దరు నిందితులు కంటేశ్వర్ లో షాప్ ముందు పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలను చోరి చేసి పరారయ్యారు.

కృష్ణ మందిర్ వద్ద ,గుర్బబాది రోడ్ వాహనాల తనీకి చేస్తుండగా ద్యావంగుల సంతోష్,ఒల్లెపు గోపి లు పోలీసులను చూసి తన మోటార్ సైకిల్ పై పారిపోవడానికి ప్రయత్నించగా టౌన్-3 పోలీసు ఎస్.ఐ మరియు సిబ్బంది అతనిని పట్టుకొని వారిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.

దీంతో వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో మూడవ టౌన్ S.I ఏ. హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments