HomePOLITICAL NEWSUncategorizedగుట్టను తొడేస్తున్నారు..! కరిగిపోతున్న ప్రభుత్వ గుట్టలు..కాసులవర్షం కురిపిస్తున్న మొరం..మల్కాపూర్(ఎ) గుట్టపైన అక్రమార్కుల కన్ను..లక్షల రూపాలయలు దండుకుంటున్న...

గుట్టను తొడేస్తున్నారు..! కరిగిపోతున్న ప్రభుత్వ గుట్టలు..కాసులవర్షం కురిపిస్తున్న మొరం..మల్కాపూర్(ఎ) గుట్టపైన అక్రమార్కుల కన్ను..లక్షల రూపాలయలు దండుకుంటున్న వైనం..

గ్రామాలకు అందాన్నిచ్చి ప్రకృతిసిద్దంగా చెట్లతో నిండి అహ్లాదాన్ని పంచుతున్న ప్రభుత్వగుట్టలు అక్రమార్కుల దాడికి కనుమరుగవుతున్నాయి. నాణ్యమైన మొరం లభించటంతో గుట్టను అక్రమంగా తవ్విసొమ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలో పలు చోట్ల గ్రామం లో, గ్రామ పొలిమేరలో సహజసిద్దంగా ఏర్పడిన ఇలాంటి గు ట్టలు అనేకంఉన్నాయి. అక్రమార్కులు కలిసి ధనార్జనే ధ్యేయంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ అక్రమదందా జోరుగా సాగిస్తున్నారు.

దీనికి పరోక్షంగా రాజకీయ నాయకుల అండఉండటంతో మొరం దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతోందనీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనీ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇచ్చారు.

ఈ నిజామాబాద్ రూరల్ మండలం, మల్కాపూర్(ఎ) గ్రామ శివారులో గల సర్వే నెంబర్లు 206, 339, 340 గల భూమిలలో నుండి అక్రమంగా మొరమును తరలించి ఇతర గ్రామాలకు విక్రయించుచున్నారు.

దీంతో స్థానికులు పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనీ ద్వజమెత్తారు. దీంతో మొరం అక్రమార్కులు యథేచ్ఛగా అర్ధరాత్రి సమయాలలో జెసిబి సహాయంలో టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఇతర గ్రామాలను తరలిస్తున్నారని తెలిపారు.

ఈ మొరం ఎటువంటి ప్రభుత్వ పర్మిట్లు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా మొరం దందా వ్యాపారులు ఇష్టానుసారంగా ఇతర గ్రామాలకు డంపుల కొద్ది తరలిస్తున్న పట్టింకునే నాథుడే కరువయ్యారనీ పేర్కొన్నారు. మొరం తీసిన ప్రదేశాల్లో పెద్ద పెద్ద గోయ్యిలు తవ్వుతున్నారు.

ఇందులో పశువులు, మనుషులు వడ్డ బతికే అవకాశం లేకుండా పోయిందనీ దుయ్యబట్టారు.వినియోగదారుల అవసరాలను ఆసరా చేసుకుని అక్ర మంగా మొరం తరలిస్తూన్నారని తెలిపారు.

రాత్రీపగలు తేడా లేకుండా మొరం తొడేస్తున్న రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments