ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని మాధవ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మంద పోచయ్య(50). దేవగిరి రైలులో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపుగా వస్తున్న సమయంలో మాధవ నగర్ క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ప్రమాదవశాత్తు కాలు జారీ కింద పడ్డాడు.తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలిసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
