అధికారంలో ఏ పార్టీ వుంటే ఏ మారుతుంది. అక్రమ దందా లు సజావుగా సాగాలంటే అక్రమ దందా చేసే వారు అధికార పార్టీ జెండా కప్పుకుంటె చాలు! యంత్రాంగం ఆ దందా ల వైపు కన్నెత్తి చూడదు. అవసరం అయితే అక్రమార్కులతో అంటకాగడానికి సైతం వెనుకాడరు.
ప్రకృతిసిద్దంగా చెట్లతో నిండి అహ్లాదాన్ని పంచుతున్న గుట్టలు కాలప్రవాహం లో కనుమరుగు అవుతున్నాయి. మొరం కోసం భారీ యంత్రాలు చేసే స్వైర విహారం కు గుట్టలు మౌనంగా కరిగిపోతున్నాయి.మారుమూల ప్రాంతాల్లో సంగతి ఎలా ఉన్న జిల్లా కేంద్రంకు జస్ట్ అయిదారు కిలోమీటర్ల దూరంకూడా లేని గ్రామాల్లో భారీ గుట్టలు మొరం తవ్వకాలకు అడ్డాగా మారాయి.
నగరానికి మూడు వైపులా మొరం కోసం గుట్టలను తవ్వేస్తున్నారు అధికార పార్టీలో ఉన్న వారే అక్రమ దందా లకు తెరలేపడంతో యంత్రాంగం నిస్సహాయంగా చూస్తుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధి లోని గుండారం శివారు లోని మల్కాపూర్ గ్రామంలో గత కొద్దీ రోజులుగా గుట్ట ను ఓ చోట నేత మొరం కోసం యదేచ్చగా తవ్వేస్తున్నాడు.ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున దాక తవ్వకాలు చేస్తున్నారు.
స్థానికంగా గ్రామ పెద్దలను నయానో భయానో మేనేజ్ చేస్తూ మొరం రాత్రికి రాత్రే గుట్ట ను దాటిస్తున్నారు ఆరు టిప్పర్లు తెల్లవారు జామున దాక విరామం లేకుండా మొరం తరలిస్తున్నాయి. పోలీసు ,రెవెన్యూ అధికారులతో ఆర్థిక బంధాలు బలగంగా వుండడం తో మొరం అక్రమ దందా అడ్డు అదుపు లేకుండ పోయింది సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనీ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇచ్చారు. ఈ నిజామాబాద్ రూరల్ మండలం, మల్కాపూర్(ఎ) గ్రామ శివారులో గల సర్వే నెంబర్లు 206, 339, 340 గల భూమిలలో నుండి అక్రమంగా మొరమును తరలించి అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని .స్థానికులు పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనీ ద్వజమెత్తారు.
దీంతో మొరం అక్రమార్కులు యథేచ్ఛగా అర్ధరాత్రి సమయాలలో జెసిబి సహాయంలో టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఇతర గ్రామాలను తరలిస్తున్నారని తెలిపారు.
ఈ మొరం ఎటువంటి ప్రభుత్వ పర్మిట్లు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా మొరం దందా వ్యాపారులు ఇష్టానుసారంగా ఇతర గ్రామాలకు డంపుల కొద్ది తరలిస్తున్న పట్టింకునే నాథుడే కరువయ్యారనీ పేర్కొన్నారు.
మొరం తీసిన ప్రదేశాల్లో పెద్ద పెద్ద గోయ్యిలు తవ్వుతున్నారు. ఇందులో పశువులు, మనుషులు వడ్డ బతికే అవకాశం లేకుండా పోయిందనీ దుయ్యబట్టారు.
వినియోగదారుల అవసరాలను ఆసరా చేసుకుని అక్ర మంగా మొరం తరలిస్తూన్నారని తెలిపారు. రాత్రీపగలు తేడా లేకుండా మొరం తొడేస్తున్న రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
