మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 6 గురికి జైలు శిక్ష విధించినట్లు పోలిసులు పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ 22 మంది పట్టుబడ్డారు. వీరిని మంగళ వారం జిల్లా కోర్టులో హాజరు పరచగా మీద టౌన్ పరిధికి చెందిన వంశీ గౌడ్ కు రెండు రోజులు. నిజామాబాద్ రూరల్ పిఎస్ పరిధిలోని విపిన్ కుమార్ కు ఒకరోజు.
మిరియాల నవీన్ ఒకరోజు జైలు శిక్ష. గడ్డం శ్రీశైలం రెండు రోజులు. శేఖర్ కు మూడు రోజులు,రాథోడ్ కిరణ్ కు రెండు రోజుల జైలు శిక్ష, మిగతా వారికి జరిమానా విధించినట్లు తెలిపారు.
అలాగే మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహనాలు తనికి చేయగా సరైన పత్రాలు,నంబర్ ప్లేట్ లేని 29 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
