ఎడ్ పల్లి మండలం ఠాణాకలాన్ ( అలీసాగర్ ) శివారులో పులి కదలిక సమాచారం తో అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఓ బ్యాంకు ఉద్యోగికి ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా పులి రోడ్డు దాటుతూ తన మీద దాడి చేయబోయిందని గ్రామస్తులకు చెప్పడంతో వారు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు అటవీ ప్రాంతంలోనే చిరుతపులి ఉండి ఉంటుందని అటవీ అధికారులు నిర్ధారించారు.
ట్రాప్ కెమెరాల ద్వారా సెర్చింగ్ చేయిస్తామన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. రైతులు, కార్మికులను పంట చేలకు, అటవీ మార్గాల్లోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పులినుంచి కాపాడుకునేందుకు గుంపులుగా వెళ్లాలని పులి కదలికలకోసం చర్యలు కొనసాగిస్తామన్నారు.
