HomePOLITICAL NEWSNationalగులాబీ శ్రేణుల్లో మళ్ళీ లిక్కర్ వణుకు .....ఈసారి బాంబ్ పేల్చిన కేరళ విపక్ష నేత ......కేరళ...

గులాబీ శ్రేణుల్లో మళ్ళీ లిక్కర్ వణుకు …..ఈసారి బాంబ్ పేల్చిన కేరళ విపక్ష నేత ……కేరళ లో లిక్కర్ కంపెనీ కోసం లాబీయింగ్ చేసిందని ఆరోపణ ……

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మిగిల్చిన విషాదం నుంచి బిఆర్ యస్ ఇంకా కోలుకోక ముందే కేరళ లిక్కర్ స్కామ్ తెరమీదికి వచ్చింది. మరోసారి గులాబీ శ్రేణుల్లో వణుకు మొదలయ్యింది. కేరళ అసెంబ్లీ లో విపక్ష నేత సతీషన్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

ఎమ్మెల్సీ కవిత ఒయాసిస్ లిక్కర్ కంపెనీ కోసం కేరళ ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారని ఆ కంపెనీకి లైసెన్స్ జారీ కావడానికి కవిత క్రియాశీలంగా పనిచేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

దీనిపై ఎంపీ అర్వింద్ తనదైన స్టయిల్ లో సెటైర్ వేశారు .నాకు మలయాళం అర్ధం కాదు…ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకెవళ్ళకైనా అర్ధం అయితే చెప్పండిఅంటూ సతీషన్ వీడియో ను పోస్టు చేశారు .కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాక ఎగిరినట్టుందంటూ దెప్పి పొడిచారు.

ఆయన పోస్టు మీద కాషాయ శ్రేణులు అదే పనిగా ట్రోల్ మొదలు పెట్టారు. అధినేత ఫామ్ హౌస్ కు పరిమితం కాగా కేటీఆర్ అనేక కేసులఉచ్చు లో చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతున్ననేపథ్యంలో కవిత నే బిఆర్ యస్ పార్టీ కితురుపు ముక్కగామారారు.

కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలు ఎండగట్టే కార్యాచరణ ఇంకా పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతుంది. లిక్కర్ కేసులో జైలు కు వెళ్ళి అయిదు మాసాల తర్వాత బయిటికి వచ్చిన కవిత దాదాపు మూడు నెలల పాటు అజ్ఞాతంలో ఉండిపోయారు.

ఇప్పుడిప్పుడే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి రాజకీయంగా క్రియాశీలం అవుతున్నారు. బీసీ ఎజెండా ను తెరమీదికి తెచ్చి హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ విపక్ష నేత మరోసారి లిక్కర్ బాంబ్ పేల్చారు గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం వుందని బీజేపీ ఎంపీ పర్వేజ్ వర్మ ఇలాగే సంచలన ఆరోపణ చేశారు .

కేసీఆర్ ఫ్యామిలీతో పాటు లిక్కర్ మాఫియా నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రూ. 150 కోట్లు అందాయని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ పర్వేజ్‌ వర్మ. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని ఆరోపించారు.

కానీ మొదట్లో కవిత తో సహా అందరూ ఖండించారు లైట్ తీసుకున్నారు కానీ కాలక్రమేని అదే లిక్కర్ కేసు కవిత మెడ చుట్టుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments