HomeTelanganaNizamabadమున్సిపల్ కార్మికుల సమాన వేతన కోసం నిరసనసమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్...

మున్సిపల్ కార్మికుల సమాన వేతన కోసం నిరసనసమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ TUCI రాష్ట్ర మహాసభ పిలుపు

మేరకు NZB మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TUCI రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ పాల్గొని ప్రసంగించారు. అయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పెరుగుతున్న జీవన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు నెలకు కనీసం ₹26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, NMR విధానాలను వెంటనే రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments