HomeTelanganaNizamabadస్కౌట్ బెటర్ సంస్థలో 70 మందికి ఉద్యోగాలు..కాల్ లెటర్లు అందజేసిన టాస్క్ సీఈవో శ్రీకాంత్...

స్కౌట్ బెటర్ సంస్థలో 70 మందికి ఉద్యోగాలు..కాల్ లెటర్లు అందజేసిన టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా

వేగంగా అభివృద్ధి చెందుతున్న అమెరికన్ ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన స్కౌట్ బెటర్, తెలంగాణ ప్రభుత్వం ఐటిఇ&సి విభాగం, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) తో కలిసి పనిచేసే, ఆర్టిఫిషియల్ రంగంలో స్థానిక యువతకు నైపుణ్య శిక్షణను అందించడమే కాకుండా, ఉపాధి అవకాశాలను సైతం కల్పించింది.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న స్కౌట్ బెటర్ సంస్థ, తెలంగాణలోని నిజామాబాద్ నగరంలోని ఐ టి హబ్ కేంద్రంలో తన రెండో శాఖని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ప్రస్తుతమున్న ఏఐ విశిష్టతను తెలియజేస్తూ నైపుణ్య శిక్షణను అందించడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది యువతీయువకులను తమ కంపెనీకి ఎంపిక చేసుకుంది.

ఈ సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ఐటీ హబ్ లో ఉద్యోగాలు సాధించిన 30 మందికి టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా కాల్ లెటర్లు అందజేశారు. అనంతరం సీఈఓ సిన్హా మాట్లాడుతూ, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ స్థాపించడం శుభపరిణామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో నడిచేది ఏఐ రంగమేనన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు యువతలో ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. కంపెనీని స్థాపించడమే కాకుండా, స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల కంపెనీ ప్రతినిధులైన రక్షిత్, రాఘవ్ లను ఆయన ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో టాస్క్ ప్రతినిధులు శ్రీనాథ్ రెడ్డి, రఘు తేజ, హన్మంత్, స్కౌట్ బెటర్ సీనియర్ టీం లీడర్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments