HomeTelanganaNizamabadగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి


  • కరీంనగర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ MLC అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డికే మద్దతు ఉంటుందని ఖరారు చేసింది.

ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు ఈ ప్రాంతం కంచుకోటగా ఉండగా.. తాజాగా ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ స్థానంతోపాటు మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకకాలంలో ఒకే సమయంలో రెండు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టి.జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ఇరువురి పదవీకాలం మార్చి 29వ తేదీన ముగియనుంది. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను అనుసరించి ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్‌నోటిఫికేషన్‌ జారీ కానుంది.

అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు.

“అల్ఫోర్స్” నరేందర్ రెడ్డి గారి ప్రస్థానం*

పూర్తి పేరు: డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి
తండ్రి పేరు : శ్రీ వి. మల్లారెడ్డి గారు
తల్లి పేరు :శ్రీమతీ లింబమ్మ గారు

కుటుంబ నేపథ్యం
మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం

భార్య డాక్టర్ వనజా రెడ్డి సంతానం: వృత్తిరీత్యా వైద్యురాలు
సంజితారెడ్డి
శ్రేయస్ రెడ్డి
విద్యాభ్యాసం
ప్రాథమిక మరియు ఉన్నత విద్య : ప్రభుత్వ ఉన్నత పాఠశాల, స్వగ్రామం, కొడిమ్యాల
ఇంటర్మీడియట్ విద్య:
ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్ వింగ్ కళాశాల, కరీంనగర్*
డిగ్రీ విద్య: ఎస్ఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్*
పీజీ: ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్

విజయ ప్రస్థానం
1991లో కరీంనగర్ లోని మంకమ్మతోటలో ఒక చిన్న గదిలో ట్యూషన్ సెంటర్ ను ప్రారంభించి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి తరగతుల ప్రారంభిస్తూ రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్విరామంగా ట్యూషన్ చెప్పేవారు
💠 సామాన్య రీతిలో ట్యుటోరియల్స్ కు సైకిల్ మీద వెళ్తూ తనదైన శైలితో బోధిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైన స్థితిలో స్థిరపడేందుకు చేసిన కృషి చాలా ప్రశంసనీయం
💠 1991లో అల్ఫోర్స్ అకాడమీతో విద్యాసంస్థలను ఆరంభించి నేడు తెలంగాణ మరియు మహారాష్ట్రలో నాణ్యతమైన విద్యకు నిర్వచనం అల్ఫోర్స్.
💠 నేడు 54 విద్యాసంస్థలను నిర్వహిస్తూ చక్కటి ప్రణాళికలతో విద్యార్థులకు నాణ్యతమైన విద్యానందిస్తూ విద్యా వ్యవస్థలో అగ్రగామిగా వెలుగొందుతున్న నరేందర్ రెడ్డి ఎంతమంది విద్యార్థులను ప్రతిష్టాత్మక ఐఐటిలలో, ఐఐఎంలలో, ఎయిమ్స్, ఎన్ఐటి, ఖ్యాతి గడించిన మెడికల్ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో మరియు విదేశాల్లో ఉత్తమ స్థానాల్లో గర్వపడే జీతాలతో స్థిరపడ్డారు
💠 నేడు వారి నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో సుమారు 5వేలకు పై గా మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు
💠 50,000 పైగా విద్యార్థులు విద్యానిభ్యసిస్తున్నారు. కరీంనగర్లో ప్రారంభమైన విద్యా వ్యవస్థ నేడు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో సైతం విద్యాసంస్థల ప్రారంభించారు
ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ అత్యుత్తమ విద్యనందిస్తుందుకు నరేందర్ రెడ్డి గారికి అంతర్జాతీయ మరియు జాతీయస్థాయి పురస్కారాలు ప్రధానం చేయడం జరిగింది.
💠 ప్రముఖంగా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా వారిచే గౌరవ డాక్టరేట్, ఇందిరా గాంధీ సద్భావన అవార్డు, ఎడ్యుకేషన్ ఎక్్సలెన్స్ అవార్డు, తెలంగాణ రాష్ట్ర అత్యుత్తమ పౌరులు , ఏపీజే అబ్దుల్ కలాం పురస్కార్, సంస్కృత బంధు పురస్కార్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డు, తదితర పురస్కారాలు అందుకొని జాతీయస్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటారు
👍 రాజకీయ ఆరంగేట్రం 2018లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు
👍 2018 లో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గానికి టికెట్ బుక్ ఆశించారు కానీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా వేరే వారికి కేటాయించడంతో పోటీ నుండి విరమించుకున్నారు
👍 2024 లో కరీంనగర్ లోక్ సభ స్థానానికి పోటీ చేయమని అవకాశం ఇచ్చినప్పటికీ పట్టభద్రులకు సేవ చేయాలనే ప్రధాన ఎజెండాతో, పట్టభద్రులకు అండగా ఉండాలని ధ్యేయంగా నేడు వారు ఉమ్మడి మెదక్- నిజామాబాద్- అదిలాబాద్- కరీంనగర్ పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉండడానికి నిర్ణయించుకున్నారు
💠 రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక పర్యాయం ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన అనుభవం, ప్రవేట్ పాఠశాలల యజమాన్యాల సంఘం ప్రతినిధిగా, శాతవాహన విశ్వవిద్యాలయంలో సెనేట్ మెంబర్ గా సేవలందించిన అనుభవం, యువజన సంఘాలకు మరియు విద్యార్థి సంఘాలకు చేయూతనిస్తూ వారి పురోభివృద్ధికి చేయూతనిచ్చిన వాడిగా గుర్తింపు తదితర అంశాలు రాజకీయాలలో కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు‌.
💠 విద్యావ్యవస్థలో చక్కటి ప్రణాళికలు, దృఢ సంకల్పంతో, నిర్విరామంగా కృషి చేస్తూ సమాజాభివృద్ధికి అత్యుత్తమ సేవలు అందజేయాలనే ప్రధాన లక్ష్యంతో నేను నరేందర్ రెడ్డి పట్టభద్రుల పక్షాన గొంతు వినిపించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ విజయం వైపు అడుగులు వేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments