రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన డిచ్ పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
డిచ్ పల్లి ఇందల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వృద్ధుడు రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు.
మృతుడిని గుర్తించుటకు మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుని వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
