మెదక్ జిల్లాకు చెందిన
బత్తుల నాగరాజు (32) కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చంద్రాయన్పల్లి వద్ద సర్వీస్ రోడ్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా రోడ్డుపక్కన మట్టి బాగ్స్ అడ్డంగా ఉంచారు. అవి గమనించని నాగరాజు బైక్‌తో ఆ బాగ్స్‌ను ఢీకొని కిందపడ్డాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్ అతనిపై నుంచి వెళ్ళిపోవడంతో నాగరాజు మృతి చెందాడు.
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సర్వీస్ రోడ్ పనుల సమయంలో సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నాగరాజు మృతితో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
