HomeCRIMEకంటైనర్ రోడ్డు ప్రమాదం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం...

కంటైనర్ రోడ్డు ప్రమాదం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మెదక్ జిల్లాకు చెందిన

బత్తుల నాగరాజు (32) కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

చంద్రాయన్పల్లి వద్ద సర్వీస్ రోడ్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా రోడ్డుపక్కన మట్టి బాగ్స్ అడ్డంగా ఉంచారు. అవి గమనించని నాగరాజు బైక్‌తో ఆ బాగ్స్‌ను ఢీకొని కిందపడ్డాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్ అతనిపై నుంచి వెళ్ళిపోవడంతో నాగరాజు మృతి చెందాడు.

ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సర్వీస్ రోడ్ పనుల సమయంలో సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నాగరాజు మృతితో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments