మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో అలీనగర్‌లో యువకుడు నడి రోడ్డుపై హత్యకు గురయ్యాడు . అలీనగర్ రహదారిపై బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం నిందితులు ఘటన స్థలం నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడిని జహంగీరాబాద్‌లో నివాసం ఉండే ఆటో డ్రైవర్ అబ్దుల్ రావూఫ్ (28)గా పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.బుధవారమే రౌడీ షీటర్ సోహైల్ హత్య కు గురి అయ్యారు 24 గంటలవ్వక ముందే మరో హత్య కలకలం రేపింది
