అక్రమంగా తరలిస్తున్న 2.5కేజీల గంజాయి నీ పట్టుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటన నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
నందిపేట్ మండల పరిధిలోని వెల్మల్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ నుంచి నందిపేట్ వైపు ద్విచక్ర వాహనం పై వస్తున్న షేక్ ఆఫ్రోజ్,షేక్ మెహబూబ్ లను పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 2.5 కేజీల గంజాయి పట్టుబడినట్లు తెలిపారు.
అనంతరం వారిని విచారణ చేపట్టగా నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి నంది పేట్ పరిధిలో ఆ గంజాయిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
