ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించనున్న “లక్షల డప్పులు, వెల గొంతులు” కార్యక్రమానికి మైనారిటీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ నేతృత్వంలో ఈ మద్దతు ప్రకటించబడింది.
ఇందులో భాగంగా, సయ్యద్ ఇస్మాయిల్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో తెలంగాణ మైనారిటీ సంఘాల నేతలు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంఘాల నాయకులు అబ్దుల్ వహాబ్, ఆసిఫ్, వసీం, సలాం, ముస్తఫా, ఇలియాస్ , నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
