బదిలీ ల విషయంలో సర్కార్ నాన్చుడి ధోరణి తో తహశీల్ధార్లు రగిలి పోతున్నారు. ఏడాది కాలంగా కాలయాపన చేస్తుంది. ఎన్నిసార్లు కల్సి విన్నవించినా సరే రెవెన్యూ మంత్రి బదిలీల ఫైల్ ముందుకు కదపడం లేదని వారంతా మండిపడుతున్నారు.
రేవంత్ తెలంగాణలో సాధారణ బదిలీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కానీ రెవెన్యూ శాఖలో మాత్రం తహశీల్ధార్ల కు మాత్రం బదిలీ చేయడానికి ససేమిరా అంది. ఎన్నికల నియమావళి మేరకు సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడేళ్లు జిల్లాలో పనిచేసే తహశీల్ధార్లును పొరుగు జిల్లాకు బదిలీ చెయ్యడం ఎన్నికల కోడ్ ముగిసాక తిరిగి వారంతా సొంత జిల్లాకు రావడం రెవెన్యూ శాఖ లో ఆనవాయితీ గా వస్తుంది.
అనివార్యం జాప్యం జరిగితే సంబంధిత ఉద్యోగ సంఘం పెద్దలు వెళ్లి మంత్రి కలిస్తే ఆ తరువాత వెనక్కి వచ్చేసే వారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆగస్టు లోనే బదిలీలు జరిగాయి.ఎన్నికల నిర్వహణలో ఉండే అధికారుల సొంత జిల్లా లో పనిచేయద్దు. అలాగే మూడేళ్లు ఒకే స్థానం లో ఉండొద్దు.
ఈ నియమావళి మేరకు జిల్లాకు చెందిన తహశీల్ధార్లను బాసర జోన్ పరిధి లో నిర్మల్ జగిత్యాల్ ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. ఆయా జిల్లాలో పనిచేస్తున్న వారిని నిజామాబాద్ కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ పూర్తీ కాగానే ఎలాగో సొంత జిల్లాకు వెళ్తామనే ధీమాతో ఆయా జిల్లాకు వెళ్లిన తహశీల్ధార్లు తమ కుటుంబాలను వదిలేసి అద్దె ఇండ్లలో వుంటూ హోటల్ భోజనం చేస్తూ ఎన్నికల విధులు పూర్తీ చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోడ్ పూర్తీ అయినా బదిలీ జరగలేదు. కొత్త సర్కార్ కొలువు దీరడంతో బదిలీ వెంటనే చేయడం సాధ్యం కాలేదు. బదిలీ ల కోసం ఎదురు చూస్తుండగానే లోకసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.
దీనితో వారంతా బదిలీ ల మీద ఆశలు వదులు కొని ఎన్నికల విధుల్లో బిజీ అయ్యారు. లోకసభ ఎన్నికలు అయ్యాక బదిలీ అనివార్యం అని భావించారు.ఎందుకంటే ఎన్నికల కోడ్ ముగిసాక యదా స్థానాలకు బదిలీ చెయ్యడం ఆనవాయితీ గా వస్తుందే కదా అనుకున్నారు.
కానీ ఈసారి కోడ్ ముగిసి 18 నెలలు గడిచినా ఇప్పటివరకు బదిలీలల ఊసే సర్కార్ ఎత్తడం లేదు. తెలంగాణ తహశీల్ధార్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు రెవెన్యూ మంత్రి ని కలసి మెమో రండం కూడా ఇచ్చారు ఆయనా సానుకూలంగా స్పందించి త్వరలో బదిలీలు చేపడతామని భరోసా ఇచ్చారు ఇప్పటివరకు బదిలీలు జరగలేదు .
గత ఏడాది సెప్టెంబ 29న రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ నల్సార్ యూనివర్సిటీ లో తహశీల్ధార్ల మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో దాదాపు 800 మంది పాల్గొన్నారు.ఈ సమావేశంలోనూ బదిలీ ల ప్రస్తావన వచ్చింది.తొందరలోనే బదిలీలు చేపడతామనిమంత్రి పక్కాగా హామీ ఇచ్చారు.
అయినా ఆ హామీ ఇప్పటివరకు కార్య రూపం దాల్చలేదు.ఎన్నికల విధులు అవ్వగానే వెనక్కి వచ్చేస్తామనే ధీమాతో తహశీల్ధార్లు తమ కుటుంబాలను జిల్లానే వదిలి వెళ్లి పోయారు. విద్యా సంవత్సరం మధ్యలో కావడం వల్ల పిల్లచదువులు సైతం యధావిధిగా కొనసాగించారు.
జూన్ లో లోకసభ ఎన్నికలు అయ్యాక కూడ ప్రభుత్వం వెనక్కి పంపిస్తామని భరోసా ఇవ్వడంతో తహశీల్ధార్లు పొరుగు జిల్లాలోనే ఒంటరి జీవితం కొనసాగిస్తూ వస్తున్నారు. రొటీన్ గా జరగాల్సిన తమ బదిలీ ల విషయంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు.
నెలల తరబడిగా కుటుంబాలకు దూరంగా వుండడం తమకు ఎంతో కష్టంగా ఉందని తహశీల్ధార్లు ఆవేదన చెందుతున్నారు
