బీజేపీ లో సంస్థాగత ఎన్నికల పక్రియ పూర్తీ అయింది జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి రెండో సారి నియామకం అయ్యారు. ఎంపీ గా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా పార్టీలో అర్వింద్ తిరుగులేని ఆధిపత్యం సాధించారు. తనకు అత్యంత విధేయుడిగా ఉన్న దినేష్ కే మరోసారి కమలసారథి అయ్యేలా చక్రం తిప్పారు.
లోకసభ ఎన్నికల్లో దినేష్ పనితీరే గీటు రాయి గా భావించిన అధిష్టానం సైతం ఈ నియామకం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో సంస్థాగత ఎన్నికల ఇంచార్జి గా ఇద్దరు సీనియర్ నేతలను నియమించారు.
వారు . జిల్లా అధ్యక్షుడి ఎన్నికలో ఓటర్ లతో భేటీ లు అయ్యారు వారి అభిప్రాయాలను సేకరించారు. ఎంపీ ,ఎమ్మెల్యే లు ,సీనియర్ నేతలు. మాజీ ఎమ్మెల్యే లు మండల కమిటీ అధ్యక్షులు ఓటర్లు గా పరిగణిస్తారు.
జిల్లా అధ్యక్షుడి విషయంలో వీరందరి అభిప్రాయాలను కమిటీ తెలుసుకుంది. మెజార్టీ నేతలు దినేష్ కే మరో దఫా పగ్గాలు ఇవ్వాలని సూచించారు. లోకసభ ఎన్నికలకు ముందే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన దినేష్ కు వచ్చాయిరాగానే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశం అయింది.
కానీ ఇవేవి అర్వింద్ లెక్క చేయలేదు. అందుకు తగ్గట్టుగానే దినేష్ సైతం ప్రతికూల పరిస్థితులను అధిగమించి పార్టీ బలోపేతం కోసం పనిచేసారు ఆ మేరకు లోకసభ ఎన్నికల్లో అర్వింద్ భారీ మెజార్టీ వచ్చింది.
అందులోనూ దినేష్ ఎమ్మెల్యే గా పోటీచేసిన రూరల్ సెగ్మెంట్ లో బీజేపీ లక్ష వోట్లు పోలయ్యాయి.అదే అర్వింద్ ను అబ్బరపడేలా చేసింది.అందుకే దినేష్ మరో దఫా ఆయనే ఉండాలని అర్వింద్ పట్టుబట్టారు .
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి సానుకూల ఫలితాలు సాధించాలని పట్టుదలతో ఉన్న ఆయన దినేష్ అయితే తన టాస్క్ మరింత సులువు అవుతుందనే అంచనాకు వచ్చారు .
. ఆర్మూర్, అర్బన్ ఎమ్మెల్యే లు సైతం దినేష్ వైపే మొగ్గు చూపారు. మరో వైపు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్ నేతలెవ్వరూ ముందుకు రాలేదు ఒకరిద్దరు ఆసక్తి ఉన్నా సరే అర్వింద్ ను కాదని ఎవ్వరూ ముందుకే రాలేక పోయారు . .
దీనితో మరోసారి జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి నియామకం లాంఛనం అయింది
