బిడి ఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అడవి పంది ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వికారాబాద్ కానిస్టేబుల్ ఎమ్మెల్యే గన్ మెన్ ముత్తంగి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు.
కొండకల్ నుంచి వెలిమెల గ్రామానికి బైకు మీద వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చేవెళ్ల ఎంఎల్ఏ కాలే యాదయ్య దగ్గర ముత్తంగి శ్రీనివాస్ గన్మెన్గా పని చేస్తున్నాడు. అతని స్వస్థలం శంకర్ పల్లి మండలం బల్కా పూర్
