వచ్చే షబ్బే బారాత్ పండగ ఏర్పాట్ల ను ఏంఐఎం నేతలు పరిశీలించారు నగరంలో బోధన్ రోడ్ లో గల ఖాదీమ్ ఖబరస్థాన్, ఖిల్లా రోడ్ లో గల జధీద్ ఖబరస్థాన్ లను సందర్శించారు .
పండగ నాడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అక్కడ లైటింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు . నగర మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ లకు ఈనెల 10 వ తేదీ లోగా పూర్తిచేయాలని కోరడంతో దానికి అధికారులు ఒప్పుకోవడంతో మజ్లీస్ నాయకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో యంఐయం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ మరియు నగర్ మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ ప్రధానకార్యదర్శి షాబాజ్ హైమద్ , కార్పొరేటర్లు ఎజాజ్ , రియాజ్, అలీ, ముఖీమ్, సమీర్, MIM నాయకులు అమర్, అజిస్ రాయ్, ఖాలీల్ తదితరులు పాల్గొన్నారు.
