నగరంలోని ఓ వ్యభిచార గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మారుతి నగర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య,సీసీఎస్ పోలీసులు ఆద్వర్యంలో దాడి చేసి ఒక నిర్వాహకురాలు,ముగ్గురు బాధిత మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి 4సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలు నిలితం రూరల్ పోలీసులకు అప్పగించారు.
